logo

రూ.8.6 లక్షల విలువైన ఖైనీ స్వాధీనం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.8.6 లక్షల విలువైన 23 బస్తాల ప్రభుత్వ నిషేధిత ఖైనీని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. సూర్యాపేట పట్టణ ఠాణాలో శనివారం

Published : 05 Dec 2021 03:19 IST


సూర్యాపేటలో పట్టుబడిన ఖైనీ వ్యాపారులతో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, తదితరులు

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.8.6 లక్షల విలువైన 23 బస్తాల ప్రభుత్వ నిషేధిత ఖైనీని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. సూర్యాపేట పట్టణ ఠాణాలో శనివారం కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి సమాచారం మేరకు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు పట్టణ ఎస్సై వీరమల్లయ్య, ఇతర సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. పాత వ్యవసాయ మార్కెట్‌లో రేపాల మధు అనే వ్యక్తికి చెందిన గోదాంలో నిల్వ చేసిన 18 బస్తాల ఖైనీ స్వాధీనం చేసుకున్నారు. మధు ఇచ్చిన సమాచారం మేరకు అతని స్నేహితుడైన ఆధారపు నరేశ్‌ దుకాణంలో మరో ఐదు బస్తాల ఖైనీ స్వాధీనం చేసుకొన్నారు. ఈ నిషేధిత ఖైనీని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. నిందితులపై పొగాకు ఉత్పత్తుల నిషేధిత చట్టం, కల్తీ, చీటింగ్‌ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, ఎస్సై వీరమల్లయ్య, క్రైం సిబ్బంది ఎం.అంజయ్య, జి.కృష్ణయ్య, కరుణాకర్‌, కె.శ్రవణ్‌, జె.సైదులును ఎస్పీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని