logo

లాభదాయక పంటలు సాగు చేయండి: కలెక్టర్‌

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో యాసంగిలో వరికి బదులు లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం

Published : 05 Dec 2021 03:19 IST


సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో యాసంగిలో వరికి బదులు లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో గోడపత్రికలు, పుస్తకాలను ఆవిష్కరించి మాట్లాడారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, పెసర, మినుములు, శనగలు, బొబ్బర్లు, ఆముదాలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, ధనియాలు, కుసుమాలు, ఆవాల సాగుపై రైతులకు వివరించాలని సూచించారు. డీఏవో రామారావు నాయక్‌, ఏడీఏలు జగ్గూనాయక్‌, జానినిమియా, సందీప్‌, సునీత, ఉషారాణి, ఆషాకుమారి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని