logo

దళితబంధుపై సంపూర్ణ అధికారం ఇవ్వండి: ఈటల

‘దళితబంధు’ పథకం ద్వారా అందించే రూ.10లక్షలపై ప్రభుత్వం దళితులకు సంపూర్ణ అధికారం ఇవ్వాలని హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా

Published : 05 Dec 2021 03:19 IST


తిరుమలగిరిలో మాట్లాడుతున్న మాజీమంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

తిరుమలగిరి, న్యూస్‌టుడే: ‘దళితబంధు’ పథకం ద్వారా అందించే రూ.10లక్షలపై ప్రభుత్వం దళితులకు సంపూర్ణ అధికారం ఇవ్వాలని హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు వెళ్తూ తిరుమలగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆటో, ట్రాలీ ఆటో ఇచ్చి చేతులు దులుపుకోవద్దని చెప్పారు. హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత నవంబర్‌ 4న నేనే కుర్చి వేసుకొని దళితబంధు పథకాన్ని అమలు చేస్తానని మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిసెంబర్‌ 4 వచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ పథకంలో విధి విధానాలు లేవని, ఎలా ఇస్తారో చెప్పడం లేదన్నారు. చివరకు బర్ల పథకం లాగా బర్లు దొరకక హర్యానాకు పోయి రూ.2లక్షల గేదెలను రూ.4లక్షలు అని చెప్పారు. అలాగే దళితబంధును కూడా చేస్తారా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయకుంటే ప్రగతిభవన్‌ ముందు మా దళితులు చావు డప్పు కొడతారని, మీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వరన్నారు. అనంతరం భాజపా, ముదిరాజ్‌ సంఘం నాయకులు బాణసంచా కాల్చి స్వాగతం పలికారు. సమావేశంలో భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కడియం రాంచంద్రయ్య, జల్లా అధికార ప్రతినిధి వై.దీనదయాళ్‌, నాయకులు కొండ సోమయ్య, ధరావత్‌ సంతోశ్‌, ఆకుల వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని