logo

ప్రాణం తీసిన ఆరబోసిన ధాన్యం

తేమ శాతం రావడానికి నిర్లక్ష్యంగా రహదారిపై ఆరబోసి.. కుప్ప చేసిన ధాన్యం ఒకరి ప్రాణం తీసింది. వడ్లకుప్పను ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 05 Dec 2021 03:19 IST


మృతుడు సత్యనారాయణ

రాజపేట, న్యూస్‌టుడే: తేమ శాతం రావడానికి నిర్లక్ష్యంగా రహదారిపై ఆరబోసి.. కుప్ప చేసిన ధాన్యం ఒకరి ప్రాణం తీసింది. వడ్లకుప్పను ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొన్నబోయిన సత్యనారాయణ (34), సాయిలు స్నేహితులు. వీరిద్దరూ సమీపంలో ఉన్న బొందుగులలో పని ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ఈ గ్రామ శివారులో రహదారిపై పోసిన వడ్లకుప్ప(ధాన్యం రాసి)ను గుర్తించక ఢీకొనడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందారు. సాయిలుకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని