logo

యాదాద్రిలో ముగిసిన కార్తిక వేడుకలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో కార్తిక మాస వేడుకలు శనివారం ముగిశాయి. గత నెల 4 నుంచి ఇప్పటి వరకు 15,962 మంది జంటలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నాయి.

Published : 05 Dec 2021 03:19 IST


సత్యనారాయణస్వామి వ్రత పర్వంలో హారతి ఇస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, ఈవో

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో కార్తిక మాస వేడుకలు శనివారం ముగిశాయి. గత నెల 4 నుంచి ఇప్పటి వరకు 15,962 మంది జంటలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నాయి. పూజలతో ఆలయ ఖజానాకు రూ.79.81 లక్షలు సమకూరాయి. గతేడాది కన్నా 1886 వ్రతాలు అధికంగా జరగడం విశేషం. మల్లాపురంలోని గోశాల ఆవరణలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు, తులసీ దామోదర కల్యాణం, వనభోజనాల పర్వాలను ఆచారంగా చేపట్టారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతంలో యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ పమేలా సత్పతి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తులసీ దామోదర కల్యాణం అనంతరం అక్కడే వన భోజనాలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న కలెక్టర్‌ ఆలయ సిబ్బందికి, విచ్చేసిన పలువురికి వనభోజనాలు వడ్డించారు. అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తి, వేదపండితులు, పూజారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు