logo

సాహితీ శిఖరం కూరెళ్ల

ఆరు దశాబ్దాలుగా తెలుగు సాహిత్య రంగానికి సేవలందిస్తున్న వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీ వేత్త, గ్రంథాలయం నిర్వాహకుడు కూరెళ్ల విఠలాచార్యకు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు

Published : 05 Dec 2021 03:19 IST


గ్రంథాలయంలో పుస్తకాలు పరిశీలిస్తున్న విఠలాచార్య

రామన్నపేట, న్యూస్‌టుడే: ఆరు దశాబ్దాలుగా తెలుగు సాహిత్య రంగానికి సేవలందిస్తున్న వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీ వేత్త, గ్రంథాలయం నిర్వాహకుడు కూరెళ్ల విఠలాచార్యకు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికిగాను విశిష్ట పురస్కారాన్ని ప్రకటించింది. విద్యార్థి దశ నుంచే తెలుగు సాహిత్య రంగంపై దృష్టి సారించిన విఠలాచార్య ఆంగ్లమాధ్యమ మోజులో ఆదరణ కోల్పోతున్న పద్య, గద్య గ్రంథాలకు తన రచనలతో జీవం పోస్తున్నారు. ఇప్పటివరకు 22 పుస్తకాలు రాశారు. వీటిలో విఠలేశ్వర శతకం, కాన్ఫిడెన్షియల్‌ రిపోర్టు (గద్య కవిత్వం)శిల్పాచార్యులు (పద్య కవిత్వం) వంటివి అనేకం ప్రాచుర్యం పొందాయి. వెల్లంకిలో సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చి పేద గ్రామీణ విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. పురాణాలు, నవలలు, పరిశోధన గ్రంథాలు, తెలుగు పద్య, గద్య రచనా సాహిత్యం, బాల సాహిత్యం, విద్యా రంగానికి సంబంధించిన అనేక పుస్తకాలు సుమారు 2లక్షలు వరకు అందుబాటులో ఉన్నాయి.  గ్రంథాలయంలో వంద సంత్సరాల క్రితం నాటి వార్తా పత్రికల వ్యాసాలు లభిస్తాయి. ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన పలువురు పరిశోధక విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు. ఇలా ఇక్కడ పరిశోధనలు చేసి డాక్టరేటు పట్టా పొందిన వారు 8మంది వరకు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని