logo

విద్యార్థులకు మానసిక వికాసం అవసరం: వీసీ

విద్యార్థులకు దేహదారుఢ్యంతో పాటు మానసిక వికాసం అవసరమని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎంజీయూలో నిర్వహించిన క్విట్‌ ఇండియా

Published : 05 Dec 2021 03:19 IST


మాట్లాడుతున్న ఎంజీయూ వీసీ గోపాల్‌రెడ్డి

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: విద్యార్థులకు దేహదారుఢ్యంతో పాటు మానసిక వికాసం అవసరమని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎంజీయూలో నిర్వహించిన క్విట్‌ ఇండియా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, యోగా వంటి వాటిలో శిక్షణ పొందాలని సూచించారు. క్రీడలు ఆడడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులచే యోగా ఆసనాలు వేయించారు. ఎంజీయూ ప్రిన్సిపల్‌ శ్రీలక్ష్మీ, అంజిరెడ్డి, ఆకుల రవి, వెంకటరమణారెడ్డి, యోగా గురువు శంకరయ్య, నాగేశ్వరరావు, సురేశ్‌రెడ్డి, జాన్‌పాల్‌, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని