కోటిరెడ్డి గెలుపునకు కృషిచేయాలి: మంత్రి
మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్ఢి వేదికపై ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, భగత్
మిర్యాలగూడ, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంసీ కోటిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులంతా కృషి చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. మిర్యాలగూడలో ఆదివారం మిర్యాలగూడ, సాగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల బలోపేతానికి తెరాస ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందని ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పుర అధ్యక్షుడు తిరునగరు భార్గవ, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.