logo
Published : 07/12/2021 03:29 IST

అసలుసీసాలు సమస్య

జిల్లాలో ఇంటి నుంచి తాగునీటిని తెచ్చుకునేవారు అధికం

ల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో కనీస వసతుల్లేక విద్యార్థులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌ 2 నుంచి జల జీవన్‌ మిషన్‌ ద్వారా సమస్యల పరిష్కారానికి యత్నించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు కానరావటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో జల జీవన్‌ మిషన్‌ ద్వారా దేశంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు, ఇతర సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభలో ఓ సభ్యురాలు అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ సోమవారం సమాధానమిచ్చారు. మరుగుదొడ్లు పనిచేయని, చేతులను శుభ్రపరచుకునే సౌకర్యం లేని బడులు నల్గొండ జిల్లాలో అత్యధికంగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో తక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ నల్గొండ జిల్లాలోని 507 ప్రభుత్వ పాఠశాలల్లో చేతిపంపు నీటిని వినియోగిస్తుండటం గమనార్హం. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని ఒక్కో బడిలో సురక్షితం కాని బావి నీటిని బాలబాలికలు తాగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పోల్చితే ఇంటి నుంచి సీసాల్లో నీటిని తెచ్చుకునే విద్యార్థుల సంఖ్య యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికం.

- నల్గొండ విద్యావిభాగం, మోత్కూరు, న్యూస్‌టుడే

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని