logo

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి: మంత్రి

భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన నివాసంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి

Published : 07 Dec 2021 03:29 IST

అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు

సూర్యాపేట(తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన నివాసంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి అంబేడ్కర్‌ చిత్రపటానికి సోమవారం నివాళి అర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, చిరుమర్తి లింగయ్య, ఎన్‌.భాస్కర్‌రావు, బొల్లం మల్లయ్యయాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్‌, రమావత్‌ రవీంద్రకుమార్‌, పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని