logo
Published : 07/12/2021 03:59 IST

సర్పంచి దంపతుల ఆత్మహత్యాయత్నంపై విచారణ

విచారణ జరుపుతన్న జడ్పీ సీఈవో సురేశ్‌, డీపీవో యాదయ్య

చింతలపాలెం, న్యూస్‌టుడే: మండలంలోని అడ్లూరు సర్పంచి దంపతులు రెండ్రోజుల కిందట ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై జిల్లా అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. కలెక్టర్‌ విచారణాధికారులుగా జడ్పీ సీఈవో సురేశ్‌, డీపీవో యాదయ్యను నియమించగా.. వారు సోమవారం కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. సర్పంచి స్వాతి దంపతులు హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన విచారణలో.. తాము చేసిన పనులకు సంబంధించి రూ.6,81,960 బిల్లులు రావాల్సి ఉందని సర్పంచి కందుకూరి స్వాతి తెలిపారు. ఎంబీల ప్రకారం రూ.1,76,217, ఎంబీలు లేకుండా రూ.5,05,045లు బిల్లులున్నాయని ప్రాథమిక విచారణలో తేలినట్టు జడ్పీ సీఈవో సురేష్‌, డీపీవో యాదయ్య పేర్కొన్నారు. ఈ మొత్తం బిల్లులు, పనులకు సంబంధించి రెండు నెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టరుకు సమర్పిస్తామని వివరించారు. ఎంపీపీ వెంకటరెడ్డి, ఎంపీడీవో గ్యామా తదితరులు పాల్గొన్నారు.

భావ్యం కాదు.. చింతలపాలెం: అభివృద్ధి పనుల పేరిట అధికారులు సర్పంచులపై ఒత్తిడి పెంచారని, ఇది భావ్యం కాదని సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు జూలూరి ధనలక్ష్మి అన్నారు. అడ్లూరు సర్పంచి స్వాతిని సోమవారం కలిసి మాట్లాడారు. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులపై అప్పుల భారం ఎక్కువవుతున్న విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సర్పంచులపై వేధింపులు మానుకోవాలని కోరారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని