logo

బంగారు విమానానికి ‘దానం’ విరాళం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాభివృద్ధిలో పునర్‌ నిర్మితమైన పంచ నారసింహుల ఆలయ విమాన గోపురానికి స్వర్ణ కవచం తొడిగే పర్వంలో తన భాగస్వామ్యం ఉండాలన్న ఆకాంక్షతో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ

Published : 07 Dec 2021 03:59 IST

ఈవోకు విరాళం అందజేస్తున్న దానం నాగేందర్‌ దంపతులు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాభివృద్ధిలో పునర్‌ నిర్మితమైన పంచ నారసింహుల ఆలయ విమాన గోపురానికి స్వర్ణ కవచం తొడిగే పర్వంలో తన భాగస్వామ్యం ఉండాలన్న ఆకాంక్షతో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్‌ సోమవారం రూ.55 లక్షల విలువైన డీడీని ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. తొలుత ఆలయంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామిని సతీసమేతంగా దర్శించుకొని విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పునర్‌ నిర్మితమైన ప్రధాన ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుమల తరహాలో ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్‌ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతారన్నారు. విరాళం సమర్పించి పూజలో పాల్గొన్న దానం కుటుంబీకులకు పూజారులు శ్రీ స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు.

వెండి వస్తువులు బహూకరణ
పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సికింద్రాబాద్‌కు చెందిన జి.చంద్రమౌళి కుటుంబ సభ్యులు ఒక కిలో 300 గ్రాముల వెండి వస్తువులను సోమవారం బహుకరించారు. స్వామి వారి నిత్యాభిషేకం నిర్వహించడం రూ.లక్ష ఖర్చుతో శంఖధార, సహస్త్రధార వస్తువులు మొక్కుగా తయారు చేయించి సమర్పించినట్లుగా దాతలు పేర్కొన్నారు.

విరాళాన్ని ఏఈవోకు అందజేస్తున్న సత్తయ్య

బాలాలయంలో నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదాద్రిలో సోమవారం నిత్య ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువ జామున ఆలయంలోని ప్రతిష్ఠా మూర్తులను మేల్కొలిపే పర్వాన్ని సుప్రభాతం ద్వారా చేపట్టారు. వేద మంత్ర పఠనాల మధ్య అష్టోత్తరం, శ్రీ సుదర్శన నారసింహ హోమం జరిపారు. సాయంత్రం వేళ అలంకార సేవోత్సవం చేపట్టారు. అనుబంధంగా కొనసాగుతున్న శివాలయంలో రామలింగేశ్వరస్వామిని ఆరాధాస్తూ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన చేపట్టారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసే పర్వంలో హైదరాబాద్‌ కాప్రాకు చెందిన సింగం సత్తయ్య దంపతులు సోమవారం రూ.51,000 విరాళంగా ఆలయ పేష్కార్‌ రమేష్‌బాబుకు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని