logo

అనూషకు ఆశ్రయం కల్పించిన అధికారులు

కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మిపురం కాలనీలో చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన దివ్యాంగ బాలిక సంపంగి అనూష దీనగాథను ‘ఆసరా లేక అనాథ’ శీర్షిక సోమవారం ‘ఈనాడు’ వెలుగులోకి

Published : 07 Dec 2021 03:59 IST

అనూషతో మాట్లాడుతున్న ఆర్డీవో కిశోర్‌కుమార్‌

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మిపురం కాలనీలో చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన దివ్యాంగ బాలిక సంపంగి అనూష దీనగాథను ‘ఆసరా లేక అనాథ’ శీర్షిక సోమవారం ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకువచ్చింది. కథనం చూసిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ స్పందించారు. వెంటనే బాలిక ఇబ్బందులు తీర్చాలని జిల్లా శిశు సంక్షేమ అధికారులు, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆర్డీవో కిశోర్‌కుమార్‌ సోమవారం ఉదయమే బాలిక నివసిస్తున ఇంటికి వెళ్లారు. ఆమె పరిస్థితి గురించి స్థానికులను అడిగి తెలుసుకుని చలించిపోయారు. తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే చనిపోవడంతో మేనమాప వద్ద ఉంటుందని, అతను కుటుంబం వలసకూలీలు కావడంతో.. ప్రస్తుతం వారు కర్నూలులో పనికి వెళ్లారని స్థానికులు వివరించారు. దీంతో బాలిక ఒక్కతే తాత్కాలిక రేకుల ఇంట్లో నివసిస్తుందని, ఇరుగుపొరుగు వారు పెడితే తింటుందని, కొన్నిసార్లు యాచిస్తూ ఆకలి తీర్చుకుంటుందని వారు తెలిపారు. అక్కడి నుంచి ఆర్డీవో బాలిక వద్దకు వెళ్లి మాట్లాడారు. అనంతరం చిన్నారికి వసతి కల్పించాలని కోదాడ సీడీపీవో అనంతలక్ష్మిని ఆదేశించారు. స్పందించిన శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలికను సూర్యాపేటలోని బాలరక్షాభవన్‌కు తరలించారు. అమ్మాయికి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో త్వరలో గురుకుల పాఠశాలలో చేర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.  సీడబ్యూసీ ఛైర్మన్‌ రమణారావు, డీసీసీవో రవికుమార్‌, బాలరక్షాభవన్‌ కో ఆర్డినేటర్‌ వెంకటలక్ష్మీ, ఆర్‌ఐ నగేష్‌, వీఆర్వో జానిపాషా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని