logo

యశోద వైద్యుల అరుదైన చికిత్స

దేశంలోనే మొదటి 3టీ ఇంట్రా-ఆపరేటివ్‌ ఎం.ఆర్‌.ఐ అండ్‌ అత్యాధునిక న్యూరో నావిగేషన్‌ సాంకేతికతతో యశోద వైద్యులు బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని విజయవంతం చేశారు. ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి కొత్త జీవితాన్ని

Published : 13 Jan 2022 04:03 IST

కోదాడ పుర కార్మికురాలికి మెదడులో కణితుల తొలగింపు

చంద్రమ్మతో మాట్లాడిస్తున్న డాక్టర్‌ రామకృష్ణ చౌదరి, శ్రీనివాస్‌రెడ్డి

తాళ్లగడ్డ(సూర్యాపేట), న్యూస్‌టుడే: దేశంలోనే మొదటి 3టీ ఇంట్రా-ఆపరేటివ్‌ ఎం.ఆర్‌.ఐ అండ్‌ అత్యాధునిక న్యూరో నావిగేషన్‌ సాంకేతికతతో యశోద వైద్యులు బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని విజయవంతం చేశారు. ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మున్సిపల్‌ కార్మికురాలు చంద్రమ్మ ఏడాది నుంచి తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. ఓ రోజు ఆకస్మికంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై మూతి వంకర పోవడం, సరిగా మాట్లాడలేకపోవడంతో వెంటనే స్థానిక వైద్యుడిని  సంప్రదించారు. అక్కడ వెంటనే సీటీ స్కాన్‌ తీయించగా మెదడులో కణితిని గుర్తించి హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడి న్యూరో సర్జన్లు డాక్టర్‌ రవీష్‌ సుంకర, డాక్టర్‌ రామకృష్ణ చౌదరి మరిన్ని పరీక్షలు చేసి ఆమె కుడివైపు మెదడులో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. ఇంట్రా ఆపరేటివ్‌ 3టీ ఎంఆర్‌ఐ, న్యూరో నావిగేషన్‌ సాయంతో గతేడాది సెప్టెంబర్‌ 9న శస్త్ర చికిత్స చేసి కణితిని విజయవంతంగా తొలగించారు. బుధవారం సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి మాట్లాడుతూ.. మెదడు చికిత్సలంటే ప్రాణాప్రాయమని, అలాంటిది న్యూరోసర్జరీ వైద్య విభాగంలో మైక్రోస్కోప్‌ ప్రవేశంతో ఈ శస్త్రచికిత్స భద్రమైందని తెలిపారు. గడిచిన కొద్ది నెలల్లోనే 1000 మందికిపైగా మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని