logo

‘మోదీ విధానాలతో రైతుల మనుగడకు విఘాతం’

ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలతో దేశ రైతుల మనుగడకు విఘాతం కలుగుతుందని ఆయిల్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు

Published : 15 Jan 2022 03:48 IST

మాట్లాడుతున్న ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి

మోత్కూరు, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలతో దేశ రైతుల మనుగడకు విఘాతం కలుగుతుందని ఆయిల్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రకటించిన మోదీ.. పెట్టుబడిని రెండింతలు చేశారని ఆరోపించారు. పురుగు మందు ధరలు కూడా విపరీతంగా పెంచారని, జీఎస్టీ పేరుతో వ్యవసాయ పరికరాల ధరలు కూడా పెంచారని విమర్శించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పుర అధ్యక్షురాలు తీపిరెడ్డి సావిత్రి, ఎంపీపీ రచ్చ కల్పన, నార్మాక్స్‌ డైరెక్టర్‌ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, పుర ఉపాధ్యక్షుడు బి.వెంకటయ్య, మార్కెట్‌ ఛైర్మన్‌ కె.యాకూబ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని