logo

మద్యం మత్తులో మురుగు కాల్వలో పడి..

మద్యం మత్తులో మురుగు కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం పస్నూర్‌

Published : 15 Jan 2022 03:48 IST


పంబాల ఈదయ్య

కొండమల్లేపల్లి, నాంపల్లి, న్యూస్‌టుడే: మద్యం మత్తులో మురుగు కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం పస్నూర్‌ గ్రామానికి చెందిన పంబాల ఈదయ్య(50) పదేళ్లుగా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసై ఇంటికి అడపాదడపా వెళ్తుండటంతో తప్పని పరిస్థితిలో భార్య లలిత, తన కుమారుడు, కుమార్తెతో కలిసి తల్లిగారి ఊరైన నాంపల్లి మండలం టీపీˆగౌరారంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు, మూడు నెలలకోసారి ఇంటికి వచ్చి వెళ్లేవాడని డిగ్రీ చదువుతున్న అతడి కుమారుడు శ్రీకాంత్‌ తెలిపాడు. ఏడాది క్రితం తన చెల్లి శిల్ప నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఇక నుంచి తమతోటే ఉంటానని చెప్పాడు కానీ.. అతడిలో మార్పు రాలేదని కుమారుడు వాపోయాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలో గల మద్యం దుకాణాల సమీపంలో గల మురుగు కాల్వలో పడి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పోలీసులు దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపనున్నట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని