logo

యాదాద్రి క్షేత్రంలో విశిష్ట పర్వాలు

వేకువజామున తిరుప్పావై.. ఉదయం, రాత్రివేళలలో అలంకార సేవోత్సవం..గోదాదేవి కల్యాణోత్సవం.. సంప్రదాయ పర్వమైన ఊంజల్‌ సేవోత్సవం విశిష్ట పర్వాలతో భోగి పండుగ రోజున యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతను

Published : 15 Jan 2022 03:48 IST

వేణుగోపాలస్వామి రూపంలో నారసింహుడు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: వేకువజామున తిరుప్పావై.. ఉదయం, రాత్రివేళలలో అలంకార సేవోత్సవం..గోదాదేవి కల్యాణోత్సవం.. సంప్రదాయ పర్వమైన ఊంజల్‌ సేవోత్సవం విశిష్ట పర్వాలతో భోగి పండుగ రోజున యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతను నింపుకొంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం శ్రీస్వామిని అలంకరించే పర్వాలను ఆలయ ఆచారంగా చేపట్టారు. ఉదయం మృగనరహరిని వేణుగోపాలస్వామిగా అలంకరించి పూజలు నిర్వహించారు. శ్రీస్వామి సేవోత్సవాన్ని బాలాలయ మండపంలో నిర్వహించారు. రాత్రివేళ స్వామిని గోవర్ధనగిరిదారిగా అలంకృతులను చేసి ఆచారంగా వేదమంత్రోచ్ఛరణలతో సేవా పర్వాన్ని కొనసాగించారు.

* సంప్రదాయంగా కొనసాగే పర్వాలలో భాగంగా అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం సందర్భంగా ఊంజల్‌ సేవోత్సవాన్ని సాయంత్రంవేళ నిర్వహించారు. మంగళవాయిద్యాలు, కీర్తనల మధ్య కొనసాగిన ఊంజల్‌ సేవోత్సవంలో మహిళా బక్తులు పాల్గొని హారతులను నివేదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని