logo

క్రమశిక్షణతో పనిచేసేవారికి గుర్తింపు: ఎంపీ

క్రమ శిక్షణతో పని చేసే వారికి సీఎం కేసీఆర్‌ సముచిత గుర్తింపు, గౌరవాన్నిస్తారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ చెప్పారు. నకిరేకల్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ

Published : 15 Jan 2022 03:48 IST


నకిరేకల్‌: రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ బాలరాజును సన్మానిస్తున్న ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్‌, న్యూస్‌టుడే: క్రమ శిక్షణతో పని చేసే వారికి సీఎం కేసీఆర్‌ సముచిత గుర్తింపు, గౌరవాన్నిస్తారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ చెప్పారు. నకిరేకల్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ సన్మాన సభలో శుక్రవారం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి బాలరాజు యాదవ్‌ పోరాడారని అభినందించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఉద్యమంలో కీలకంగా పని చేసిన బాలరాజుకు తగిన పదవి ఇవ్వాలని సీఎంకు, కేటీఆర్‌కు తాను విజ్ఞప్తి చేశానని చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. జడ్పీటీసీ సభ్యులు మాద ధనలక్ష్మి, తరాల బలరాం, మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ నడికుడి ఉమారాణి, పుర ఛైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌, తెరాస మండల, పట్టణ అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి, గున్నెబోయిన యాదగిరి యాదవ్‌, పుర కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత ప్రాంతం నకిరేకల్‌కు తొలిసారి విచ్చేసిన బాలరాజు యాదవ్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘం నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. పద్మా నగర్‌ బైపాస్‌ కూడలి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు స్వాగత ప్రదర్శన నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని