logo

స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటుకు అడుగులు

 మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా నల్గొండ మున్సిపాలిటీలో స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటుకు మెప్మా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో అన్ని పురపాలికల్లో ఇప్పటికే ఏర్పాటు చేసి మహిళ సాధికారతకు

Published : 15 Jan 2022 03:48 IST

మహిళా సంఘాల ప్రతినిధులు

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా నల్గొండ మున్సిపాలిటీలో స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటుకు మెప్మా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో అన్ని పురపాలికల్లో ఇప్పటికే ఏర్పాటు చేసి మహిళ సాధికారతకు తోడ్పాటు అందిస్తుండగా నల్గొండలో మెప్మా అధికారుల నిర్లక్ష్యంతో జాప్యం నెలకొంది. పుర కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమణాచారి ఆదేశాల మేరకు నల్గొండ పట్టణంలో ఉన్న పొదుపు సంఘాల సభ్యులందరిని సభ్యులుగా చేర్చి బ్యాంకు ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి.

స్త్రీ నిధి బ్యాంకు ఏర్పాటు చేస్తే నల్గొండ పట్టణంలో సుమారు 23000 మంది పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఇప్పటికే బ్యాంకు ద్వారా రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. వీటికి తోడు స్త్రీనిధి రుణాలు మంజూరైతే మహిళలు సాధికారత పొందేందుకు వెసులుబాటు లభించనుంది. బ్యాంకు రుణాలు మాత్రం సంఘానికి మంజూరు చేస్తుండగా వాటిని సభ్యులందరూ పంచుకుని ఇతర ఖర్చులు చేస్తున్నారు. అదే స్త్రీనిధి రుణాలు చిరు వ్యాపారం, ఇతరాత్ర పనులకు ఉపయోగించుకునే వారికి మాత్రమే మంజూరు చేయనున్నారు.

ఆర్పీలకు బాధ్యతలు
స్త్రీ నిధి బ్యాంకు ఏర్పాటు చేయాలంటే విధిగా కొంత మూలధనం ఉండా లి. అందులో సభ్యులందరికీ భాగస్వామం కల్పించాలి. ఇప్పటికే పట్టణ సమాఖ్యల వద్ద రూ.7 లక్షల వరకు నిధులు ఉన్నాయి. వాటితో ప్రారంభించేందుకు కొంత మంది ఆర్పీలు ఉత్సాహం చూపించినా కమిషనర్‌ అడ్డు చెప్పారు. సమాఖ్యల నిధులు పంచుకోవాల్సిన అవసరం లేదు. స్త్రీ నిధిలో భాగస్వాములయ్యేందుకు ఒక్కో సమాఖ్య రూ.25,000 చొప్పున మూల ధనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మెప్మా సమన్వయకర్తలకు కమిషనర్‌ బాధ్యతలు అప్పగించారు. ఆర్పీలు రంగంలో దిగి మహిళా సంఘాల సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈనెల చివరి నాటికి ఏర్పాటు; శ్రీనివాస్‌, టీఎంసీ నల్గొండ మున్సిపాలిటీ
నల్గొండ పట్టణంలో స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే రెండుసార్లు సమావేశం నిర్వహించాం. స్లమ్‌ ఫెడరేషన్‌ స్థాయిలో పొదుపు సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి వారిని భాగస్వామ్యులను చేసేలా కృషి చేస్తున్నాం. ఈ నెల చివరి నాటికి స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని