logo

పేటను ముంచెత్తిన వాన

నల్గొండ జిల్లాలో ఆదివారం సగటున 19.2 మి.మీ వర్షపాతం నమోదైంది. నకిరేకల్‌లో 117 మి.మీ., కట్టంగూర్‌లో 99.8, మునుగోడు-96.6, కనగల్‌- 61.2, చిట్యాల- 32.8, నార్కట్‌పల్లి- 32.9, కేతేపల్లి- 70.9, శాలిగౌరారం- 7.8, నల్గొండ- 18.4, తిప్పర్తి- 7.6, చండూరు- 25.3, మాడ్గులపల్లి- 13.5, గుర్రంపోడు- 5 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

Published : 17 Jan 2022 05:28 IST

నల్గొండ జిల్లాలో వర్షపాతం

సూర్యాపేట: తాళ్లగడ్డ కూడలి వద్ద వరద నీటి ఉద్ధృతి

నల్గొండ గ్రామీణం: నల్గొండ జిల్లాలో ఆదివారం సగటున 19.2 మి.మీ వర్షపాతం నమోదైంది. నకిరేకల్‌లో 117 మి.మీ., కట్టంగూర్‌లో 99.8, మునుగోడు-96.6, కనగల్‌- 61.2, చిట్యాల- 32.8, నార్కట్‌పల్లి- 32.9, కేతేపల్లి- 70.9, శాలిగౌరారం- 7.8, నల్గొండ- 18.4, తిప్పర్తి- 7.6, చండూరు- 25.3, మాడ్గులపల్లి- 13.5, గుర్రంపోడు- 5 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

సూర్యాపేట: అమరవాదినగర్‌లో నీట మునిగిన ఇళ్లు

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల చెరువుల అలుగులు పారాయి. లోతట్టుప్రాంతాలు, పైర్లు జలమయమయ్యాయి. అక్కడక్కడా విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ఇళ్లల్లోకి వర్షం నీరు చేరటంతో రాత్రంతా జాగారం చేశారు. నకిరేకల్‌, సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో అత్యధికంగా 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

పేటలో అలుగు పోస్తున్న సద్దుల చెరువు

మంత్రి సమీక్ష

సూర్యాపేట (తాళ్లగడ్డ): సూర్యాపేటలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులతో ఆదివారం ఉదయం సెల్‌కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. తెరాస శ్రేణులూ రంగంలోకి దిగాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని