logo

ముగ్గుల సందడి.. పతంగుల సవ్వడి

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు సంబరంగా జరుపుకొన్నారు. భూమిపై ఆకర్షణీయమైన రంగవల్లుల హరివిల్లులు.. ఆకాశంలో గాలిపటాలు కనువిందుగొలిపాయి. బంధుమిత్రుల రాకతో గ్రామాలు కోలాహలంగా మారాయి

Published : 17 Jan 2022 05:50 IST

హాలియాలో నృత్యాలు చేస్తున్న చిన్నారులు

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు సంబరంగా జరుపుకొన్నారు. భూమిపై ఆకర్షణీయమైన రంగవల్లుల హరివిల్లులు.. ఆకాశంలో గాలిపటాలు కనువిందుగొలిపాయి. బంధుమిత్రుల రాకతో గ్రామాలు కోలాహలంగా మారాయి. తొలిరోజు భోగీ.. రెండోరోజు మకర సంక్రాంతి.. మూడోరోజు కనుమను ఘనంగా జరుపుకొన్నారు. పలుచోట్ల మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పిల్లలు పెద్దలు పోటీపడి పతంగులు ఎగురవేశారు. అక్కడక్కడ గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

- హాలియా, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని