logo

బహుజనులకు అండగా ెకేసీఆర్‌: బడుగుల

బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి సీఎం కేసీఆర్‌ అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల అబివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎంపికైన డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌

Published : 17 Jan 2022 05:50 IST

దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను సన్మానిస్తున్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, పక్కన డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వట్టె జానయ్య, తదితరులు

నీలగిరి, న్యూస్‌టుడే: బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి సీఎం కేసీఆర్‌ అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల అబివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎంపికైన డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ ఆత్మీయ సన్మానం ఆదివారం స్థానిక యాదవ సంఘం భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి ఒక పథకం అందేలా కేసీఆర్‌ కృషి చేశారని చెప్పారు. జిల్లాలో యాదవులకు మంచి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. బాలరాజు యాదవ్‌ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమంలో తనను గుర్తించిన సీఎం తనకు పదవి అప్పగించారని చెప్పారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా గొర్రెల మేకల పెంపకం దారుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లోడంగి గోవర్థన్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వట్టె జానయ్య, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు బొబ్బల గోపాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు తరాల పరమేశ్‌యాదవ్‌, నాయకులు తండు శ్రీనివాస్‌ యాదవ్‌, చీర పంకజ్‌యాదవ్‌, పల్ల్లెబోయిన కాశీరాములు యాదవ్‌, కొలగాని పర్వతాలు యాదవ్‌, సోమనబోయిన సుధాకర్‌ యాదవ్‌, నూక కిరణ్‌యాదవ్‌, ఏడుకొండలు , రజకసంఘం నాయకులు కొండూరి సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టెల శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని