logo

దివ్యాంగుడికి చేయూత

లిటిల్‌సోల్జర్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మానసిక, శారీరక దివ్యాంగుడు మర్రి శివ కుటుంబానికి చేయూతనందించారు. చెర్వుపల్లి గ్రామానికి చెందిన మర్రి వెంకటమ్మ కుమారుడు దివ్యాంగుడి వైద్యానికి దాతలు సహకరించాలని

Published : 17 Jan 2022 06:13 IST

తల్లికి సాయం అందజేస్తున్న లిటిల్‌సోల్జర్స్‌ సభ్యులు

మాడ్గులపల్లి,న్యూస్‌టుడే: లిటిల్‌సోల్జర్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మానసిక, శారీరక దివ్యాంగుడు మర్రి శివ కుటుంబానికి చేయూతనందించారు. చెర్వుపల్లి గ్రామానికి చెందిన మర్రి వెంకటమ్మ కుమారుడు దివ్యాంగుడి వైద్యానికి దాతలు సహకరించాలని ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన నకిరేకల్‌కు చెందిన లిటిల్‌సోల్జర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు, రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మదేవర నరేశ్‌, కర్నాటి నరేశ్‌, కందుకూరి శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని