logo

కొవిడ్‌పై అప్రమత్తత అవసరం: డీఎంహెచ్‌వో

కొవిడ్‌ కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో కోటాచలం పేర్కొన్నారు. సోమవారం గరిడేపల్లి పీహెచ్‌సీని సందర్శించి వ్యాక్సినేషన్‌, పరీక్షలు,

Published : 18 Jan 2022 02:40 IST

గరిడేపల్లి: టీకా పంపిణీ వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీఎంహెచ్‌వో కోటాచలం

గరిడేపల్లి: కొవిడ్‌ కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో కోటాచలం పేర్కొన్నారు. సోమవారం గరిడేపల్లి పీహెచ్‌సీని సందర్శించి వ్యాక్సినేషన్‌, పరీక్షలు, కొవిడ్‌ నిబంధనల అమలు తీరుపై సమీక్షించారు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించకపోతే ముప్పు తప్పదని హెచ్చరించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలన్నారు. టీకా వేసుకున్నాం మాకు ఏమికాదనే ధోరణి వీడనాడాలని రెండు డోసులు వేసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా ముందస్తు జాగత్త్ర డోసు వేసుకోవాలని సూచించారు. ప్రోగ్రాం అధికారి పి.వెంకటపాపిరెడ్డి, అంజయ్య, డాక్టర్‌ నరేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని