logo

అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి జైలుశిక్ష

వివాహిత యువతిపై అత్యాచార యత్నం చేసి ఆమెను కులం పేరుతో దూషినందులకు మూడేళ్ల జైలుశిక్షను విధిస్తూ ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ జిల్లా సేషన్స్‌ న్యాయస్థానం

Published : 18 Jan 2022 02:40 IST

నల్గొండ లీగల్‌, న్యూస్‌టుడే: వివాహిత యువతిపై అత్యాచార యత్నం చేసి ఆమెను కులం పేరుతో దూషినందులకు మూడేళ్ల జైలుశిక్షను విధిస్తూ ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ జిల్లా సేషన్స్‌ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువర్చింది. జిల్లాలోని మర్రిగూడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన అదే మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన జంగిలి శ్రీశైలంకు మూడేళ్ల జైలుశిక్షను న్యాయమూర్తి భవాణీ విధించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం కేసు వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలు 2016 సెప్టెంబరు 8 మధ్నాహ్నం తన భర్తతో కలసి బ్యాంకు పనిమీద మర్రిగూడ మండలం, శివన్నగూడేనికి వెళ్లారు. అక్కడ భోజన విరామ సమయం కావడంతో ఆమె టిఫిన్‌ చేయడానికి సమీపంలోని హోటల్‌కు వెళ్లారు. అక్కడ మద్యం తాగిన మైకంలో ఉన్న శ్రీశైలం, బండి కృష్ణయ్య(ఎ2 చనిపోయాడు)లు బాధితురాలిని హత్యాచారం చేయబోయారు. ఆమె ఎదురుతిరగడంతో కులం పేరుతో దూషించి కాళ్లతో తన్నారు. అక్కడికి వచ్చిన భర్తను కర్రలతో కొట్టి గాయపర్చారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న మర్రిగూడ పోలీసులు, దర్యాప్తు ముగించి నిందితులుగా జంగిలి శ్రీశైలం, బండి కృష్ణయ్యలపై ఛార్జిషీటు కోర్టులో దాఖలు చేశారు. న్యాయస్థానంలో విచారణలో మొదటి ముద్దాయి జంగిలి శ్రీశైలంపై నేరనిర్ధారణ కావడంతో అతనికి అత్యాచారయత్నం చేసినందులకు మూడేళ్ల జైలుశిక్ష, కులం పేరుతో దూషించినందులకు ఆరునెలల జైలు, రూ.5వేలు జరిమానా, కొట్టినందులకు ఆరు నెలల జైలు శిక్షను న్యాయమూర్తి భవాణీ విధిస్తూ తీర్పు చెప్పారు. రెండవ ముద్దాయి చనిపోవడంతో అతనిపై కేసును నిలిపివేశారు. విధించిన అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు జరుపబడతాయని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌ తరపున అదనపు పీపీలు జవహార్‌లాల్‌, సిరిగిరి వెంకట్‌రెడ్డిలు వాధించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని