logo

రూ.25 కోట్లతో నందికొండ అభివృద్ధి

ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.25 కోట్లతో నందికొండ పురపాలికను సుందరంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ విజేత

Published : 18 Jan 2022 02:40 IST

సాగర్‌: కాలనీలో పర్యటిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎమ్మెల్యే భగత్‌,

ఎమ్మెల్సీ విజేత కోటిరెడ్డి, తదితరులు

నాగార్జునసాగర్‌, హాలియా, న్యూస్‌టుడే: ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.25 కోట్లతో నందికొండ పురపాలికను సుందరంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ విజేత కోటిరెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి సాగర్‌ కాలనీలల్లో నిర్వహించాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పురపాలిక కార్యాలయంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగత్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నందికొండ పురపాలిక అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా విడుదల చేసిన రూ.15 కోట్లు, తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ అభివృద్ధి సంస్థ ద్వారా విడుదలైన రూ.10 కోట్ల ద్వారా అవసరమైన పనులను నిర్వహిస్తామన్నారు. కలెకర్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులతో అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ప్రణాళిక నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. అంతకుముందు హాలియాలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి డిగ్రీ కళాశాల భవనం స్థలం, మినీ స్టేడియం, సమీకృత మార్కెటు, డిజిటల్‌ గ్రంథాలయం, వైకుంఠధామం రహదారి, సాగర్‌రోడ్‌లోని మురికికూపంగా మారిన పేరూరు మేజర్‌ పంట కాల్వను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు