logo

ముమ్మరంగా గాలింపు.. లభించని ఆచూకీ

లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ మంగళవారం రాత్రి వరకు లభ్యమవ్వలేదు. అడ్లూరుకు చెందిన చంద్రశేఖర్‌, శ్రీగోపిలు పడవపై సోమవారం ఉదయం నదిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు నదిలో

Published : 19 Jan 2022 04:17 IST

నదీ తీరంలో స్థానికులతో మాట్లాడుతున్న తహసీల్దారు నవీన్‌ చంద్ర తివారి, ఎస్సై రంజిత్‌రెడ్డి

చింతలపాలెం, న్యూస్‌టుడే: కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ మంగళవారం రాత్రి వరకు లభ్యమవ్వలేదు. అడ్లూరుకు చెందిన చంద్రశేఖర్‌, శ్రీగోపిలు పడవపై సోమవారం ఉదయం నదిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు నదిలో పడవ బోల్తా పడడంతో వీరు గల్లంతయ్యారు. వీరి కోసం మత్స్యకారులు, గజ ఈతగాళ్లతో రెండ్రోజులు గాలించినా ఫలితం దక్కలేదు. తహసీల్దారు నవీన్‌చంద్ర తివారి, ఎస్సై రంజిత్‌రెడ్డిలు సాయంత్రం వరకు గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఫలితం లేకపోవడంతో బుధవారం జాతీయ విపత్తుల నివారణ బృందాన్ని రప్పించనున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు