logo

ముగిసిన అధ్యయనోత్సవాలు

యాదాద్రిలో దివ్య ప్రబంధ పఠనం, ఆలయ దేవుడి అధ్యయనోత్సవ నిర్వహణతో వార్షిక అధ్యయనోత్సవాలకు మంగళవారం తెర పడింది. వైష్ణవ క్షేత్రాలలో వైకుఠ ఏకాదశి రోజు మొదలైన

Published : 19 Jan 2022 04:17 IST

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, ఆళ్వారుల అలంకార సేవలు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో దివ్య ప్రబంధ పఠనం, ఆలయ దేవుడి అధ్యయనోత్సవ నిర్వహణతో వార్షిక అధ్యయనోత్సవాలకు మంగళవారం తెర పడింది. వైష్ణవ క్షేత్రాలలో వైకుఠ ఏకాదశి రోజు మొదలైన అధ్యయనోత్సవాలు ఆరు రోజుల పాటు కొనసాగాయి. స్వామి అలంకరణతో వేడుకలు ముగిశాయని ఆలయ ప్రధాన పూజారి లక్ష్మీనరసింహ చార్య వెల్లడించారు. బుధవారం నుంచి స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవాలు మొదలవుతాయన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం క్షేత్రాన్ని సందర్శించారు. బాలాలయంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని పూజల్లో పాల్గొని ఆశీస్సులు పొందారు.
మంత్రి ఎర్రబెల్లి పూజలు
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం సందర్శించారు. కొండపై గల బాలాలయంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని సువర్ణ పుష్పార్చన జరిపించారు. దర్శన అనంతరం ఆయనకు పూజారులు ఆలయ సంప్రదాయంగా ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ పేష్కార్‌ రమేశ్‌బాబు స్వాగతం పలికి దేవుడి ప్రసాదం అందజేశారు. మంత్రి వెంట తెరాస స్థానిక మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు పవన్‌ ఉన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని