logo

పెండింగ్‌ దరఖాస్తులు సత్వరమే పరిష్కరించండి: కలెక్టర్‌

ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు, ధరణి పెండింగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజన్‌ అధికారులు, తహసీల్దార్లతో ప్రజావాణి ఫిర్యాదులు

Published : 19 Jan 2022 04:17 IST

ప్రజావాణి ఫిర్యాదులు, ధరణి పెండింగ్‌ దరఖాస్తులపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి,  పక్కన అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

భువనగిరి, న్యూస్‌టుడే: ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు, ధరణి పెండింగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజన్‌ అధికారులు, తహసీల్దార్లతో ప్రజావాణి ఫిర్యాదులు, ధరణి పెండింగ్‌ దరఖాస్తులపై మంగళవారం సమీక్షించారు. ప్రజావాణిలో వచ్చిన 277 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు భూపాల్‌రెడ్డి, సూరజ్‌ కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరాచారి పాల్గొన్నారు.
తుర్కపల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను మరింత మెరుగు పరచాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. తుర్కపల్లి పీహెచ్‌సీని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది పని తీరు, మౌలిక వసతులపై ఆరా తీశారు. త్వరగా రెండు డోసుల ప్రక్రియ పూర్తి చేసి బూస్టరు కూడా ఇవ్వాలని డాక్టరు చంద్రారెడ్డికి సూచించారు.

ఆకస్మిక తనిఖీ
బొమ్మలరామారం: గ్రామీణ ప్రాంతంలోని ప్రజలందరికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి దస్త్రాలను పరిశీలించారు. వైద్యాధికారి క్రాంతి కుమారి, సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు