logo

అద్దె గదుల్లోనే కొత్త పంచాయతీలు

గిరిజనులను అభివృద్ధి చేయాలని, వారు నివసించే తండాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. మూడేళ్లయినా ఇప్పటి వరకు పంచాయతీలుగా రూపొందిన తండాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అనేక పంచాయతీలకు ఇంకా రహదారి సౌకర్యం లేదు. గ్రామాల్లో కాలువలు లేక వీధుల్లో మురుగునీరు పారుతోంది.

Published : 20 Jan 2022 02:45 IST

మోత్యాతండా గ్రామపంచాయతీలో అద్దె గది ఆవరణలో సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం(దాచిన చిత్రం)

నల్గొండ కలెక్టరేట్‌, తుర్కపల్లి, న్యూస్‌టుడే: గిరిజనులను అభివృద్ధి చేయాలని, వారు నివసించే తండాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. మూడేళ్లయినా ఇప్పటి వరకు పంచాయతీలుగా రూపొందిన తండాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అనేక పంచాయతీలకు ఇంకా రహదారి సౌకర్యం లేదు. గ్రామాల్లో కాలువలు లేక వీధుల్లో మురుగునీరు పారుతోంది.

కొత్త పంచాయతీలకు ఇప్పటివరకు సొంత భవనాలు నిర్మించలేదు. ఉమ్మడి జిల్లాలో 1740 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 561 కొత్తగా ఏర్పాటయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 673 పంచాయతీలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పంచాయతీ కార్యాలయాలను అసౌకర్యాలతో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అనేక తండాల్లోని పంచాయతీలను ఒక గది అద్దెకు తీసుకుని కొనసాగిస్తున్నారు. కనీసం పంచాయతీ సమావేశాలు నిర్వహించుకునేందుకు వసతి లేక అద్దె గదుల ఆవరణల్లో, సమీపంలోని చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని అద్దె భవన పంచాయతీల్లో వర్షమొస్తే అందులో ఉండే పరిస్థితి లేదు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. కార్యాలయ దస్త్రాలు, ఇతర సామగ్రిని భద్రపర్చడంలో సమస్యలు ఏర్పడుతున్నట్లు పలువురు కార్యదర్శులు పేర్కొంటున్నారు.


సమావేశాలు ఆరుబయట నిర్వహిస్తున్నాం

- అర్జున్‌సింగ్‌, సర్పంచి, మోత్యతండా, చందంపేట మండలం

కొత్తగా ఏర్పాటు జరిగిన గ్రామ పంచాయతీలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. వసతి లేక సమావేశాలు ఆరుబయట నిర్వహించాల్సి వస్తోంది. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. తాగునీటి వసతి, రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలి. పల్లె ప్రగతి కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది.


అద్దె చెల్లింపు భారంగా మారింది

- పూజార్ల ఆదిలక్ష్మీ, ఆరెగూడెం సర్పంచి, తిప్పర్తి మండలం

గ్రామ పంచాయతీకి సొంతభవనం లేకపోవడంతో ఇబ్బ ందులు ఎదురవుతున్నాయి. అద్దె భవనంలో పంచాయతీ నిర్వహించాల్సి వస్తోంది. అద్దె చెల్లింపు పంచాయతీకి భారంగా మారింది. సౌకర్యాలు సక్రమంగా లేవు. ఒక్క గదిలోనే కార్యాలయం నిర్వహించాల్సి వస్తోంది. కొత్త పంచాయతీ భవనానికి ప్రభుత్వం ని ధులు కేటాయించాలి.


నిధులు తక్కువే..

తక్కువ జనాభాతో ఏర్పాటైన కొత్త పంచాయతీలను నిధుల కొరత పీడిస్తోంది. ఆర్థిక సంఘం నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. దీంతో తక్కువ జనాభా కలిగి ఉన్న పంచాయతీలకు తక్కువ నిధులు మంజూరు కావడంతో సమస్యలు పరిష్కరించేందుకు వచ్చే నిధులు సరిపోవడం లేదు. కొత్తగా ఏర్పాటు జరిగిన పంచాయతీల్లో పన్నుల వసూలు అంతంతమాత్రంగానే జరుగుతుంది. ఫలితంగా నిధుల కొరత ఏర్పడుతోంది. దీనికి తోడు విద్యుత్తు బిల్లులు, సిబ్బంది వేతనాలు, కార్యాలయ భవనాలకు అద్దె చెల్లించడం వంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.


సొంత భవనం లేని పంచాయతీలు

కొత్త పంచాయతీలు మొత్తం

పంచాయతీలు

342

844

349


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని