logo

ప్రమాదాలకు అడ్డుకట్ట

ఉమ్మడి జిల్లాలో రహదారి ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డీజీపీ స్థాయి అధికారి ప్రత్యేకంగా జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారంటే ప్రమాదాల స్థాయి ఏవిధంగా ఉందనేది చెప్పాల్సిన పనిలేదు.

Published : 20 Jan 2022 02:45 IST

బ్లాక్‌స్పాట్లను గుర్తించిన పోలీసులు

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై దుప్పలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద సిగ్నల్‌ లేక పోవడంతో అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనాలు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో రహదారి ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డీజీపీ స్థాయి అధికారి ప్రత్యేకంగా జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారంటే ప్రమాదాల స్థాయి ఏవిధంగా ఉందనేది చెప్పాల్సిన పనిలేదు. గతంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటే మృతుల సంఖ్య తక్కువగా ఉండేది. ఇటీవల జాతీయ రహదారులతో పాటు ప్రధాన రాష్ట్ర రహదారులపై ప్రమాదాల స్థాయిలో మృతులు, క్షతగాత్రులు ఉంటున్నారు. దీంతో పోలీస్‌ శాఖతో పాటు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో రహదారి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి పై చిట్యాల లాంటి ప్రాంతాల్లో వంతెన కట్టాల్సిన అవసరముందని పోలీస్‌ శాఖ సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచింది.

గడిచిన మూడేళ్లలో..

జిల్లాలో గడిచిన మూ డేళ్లలో జాతీయ, రాష్ట్ర రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అయిదుగురు, ఆపైన మృతి చెందిన ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌గా గుర్తించారు. పది మంది ఆపైన మృతి చెందిన ప్రాంతాల్లో సమన్వయ శాఖల ద్వారా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీస్‌ శాఖతో పాటు పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపాలిటీ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకోనున్నారు. జీబ్రా గీతలు, రోడ్డు వెడల్పు, డివైడర్లు, సీసీ కెమెరాలు, అవసరాన్ని బట్టి స్పీడ్‌ బ్రేకర్లు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాట్లు చేయనున్నారు. ఇటీవల పోలీస్‌లు గుర్తించిన ప్రమాద గంతికలు రోడ్డుకు అటు ఇటుగా 600 మీటర్ల ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకుని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని