logo

అభివృద్ధికి సహకరించండి: ఆర్డీవో

నందికొండ పురపాలిక అభివృద్ధికి సహకరించాలని, ఎవరూ నష్టపోకుండా అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆర్డీవో రోహిత్‌ సింగ్‌ అన్నారు. బుధవారం పైలాన్‌ కాలనీకి చెందిన స్థానికులతో స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు

Published : 20 Jan 2022 03:08 IST

గ్రంథాలయం వద్ద కొలతను తీసుకుంటున్న ఇంజినీర్లు

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నందికొండ పురపాలిక అభివృద్ధికి సహకరించాలని, ఎవరూ నష్టపోకుండా అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆర్డీవో రోహిత్‌ సింగ్‌ అన్నారు. బుధవారం పైలాన్‌ కాలనీకి చెందిన స్థానికులతో స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. పైలాన్‌ పిల్లర్‌ నుంచి జెన్‌కో వరకు గల రోడ్డు విస్తరణకు కొన్ని నిర్మాణాలు అడ్డంగా ఉన్నాయని వాటిని సొంతదారులు స్వచ్ఛందంగా తొలగించాలని, ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. నివాసగృహాల సొంతం చేసే విషయంలో అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. పుర కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ సైదులు ఆర్‌ఐ లక్ష్మీకాంత్‌, వీఆర్వో నిరంజన్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభమైన సర్వేలు.. నందికొండ పురపాలికలో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులను నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశాల మేరకు పైలాన్‌లోని పిల్లర్‌ నుంచి జెన్‌కో అతిథి గృహం వరకు ఏర్పాటు చేయనున్న రోడ్డు విస్తరణ, డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటు చేయనున్న ప్రస్తుత లైబ్రరీ భవనాన్ని ఇంజినీర్ల బృందం పరిశీలించింది. బుధవారం కొలతలు నమోదు చేస్తూ సర్వే నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని