logo

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన

దేవరకొండ వ్యవసాయశాఖ ఏడీఏగా వీరప్ప బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సిద్దిపేట నుంచి సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొండమల్లేపల్లి ఏవో కార్యాలయంలో ఏవో, ఏఈవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు

Published : 20 Jan 2022 03:08 IST

సమీక్షా సమావేశంలో ఏవో, ఏఈవోలకు సూచనలిస్తున్న నూతన ఏడీఏ వీరప్ప

దేవరకొండ, కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే: దేవరకొండ వ్యవసాయశాఖ ఏడీఏగా వీరప్ప బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సిద్దిపేట నుంచి సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొండమల్లేపల్లి ఏవో కార్యాలయంలో ఏవో, ఏఈవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఏడీఏ వీరప్ప సూచించారు. మండలంలో గల రైతుల, వారు సాగు చేసే పంటలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు చేరువగా ఉంటూ సాగులో సలహాలు, సూచనలివ్వాలని తెలిపారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఏవో విజయ్‌రెడ్డి, ఏఈవోలు సర్దార్‌, సురేష్‌, అనంతలక్ష్మి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని