logo

పనులు చూసి.. దస్త్రాలు పరిశీలించి

దేవరకొండ పరిధిలోని జరిగే ఉపాధిహామీ పనులను గురువారం నేషనల్‌ లెవల్‌ మానిటరింగ్‌ అండ్‌ అవెల్యూషన్‌ సభ్యులు పరిశీలించారు. మండల పరిధిలోని తాటికోల్‌, కొండభీమనపల్లి, పెద్దతండాలో ఎన్‌ఎల్‌ఎం బృందం సభ్యులు గంగప్ప పనుల తీరును అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Published : 21 Jan 2022 02:35 IST

అజ్మాపురంలో ఉపాధి పనులను పరిశీలిస్తున్న జాతీయ స్థాయి బృందం పరిశీలకుడు గంగప్ప

దేవరకొండ, న్యూస్‌టుడే: దేవరకొండ పరిధిలోని జరిగే ఉపాధిహామీ పనులను గురువారం నేషనల్‌ లెవల్‌ మానిటరింగ్‌ అండ్‌ అవెల్యూషన్‌ సభ్యులు పరిశీలించారు. మండల పరిధిలోని తాటికోల్‌, కొండభీమనపల్లి, పెద్దతండాలో ఎన్‌ఎల్‌ఎం బృందం సభ్యులు గంగప్ప పనుల తీరును అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠధామం, చెత్తడంపింగ్‌లో వర్మికంపోస్టు తయారు చేసే విధాన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీలో మొక్కలను పరిశీలించారు. కొండభీమనపల్లి గ్రామ పంచాయతీలో దస్త్రాలు పరిశీలించారు. గ్రామంలో ఉన్న క్రిమిటోరియం పరిశీలించి, దొండ పందిరి రైతులతో మాట్లాడారు. ఆయన వెంట ఏపీడీలు శైలజ, రవీందర్‌, ఎంపీడీవో శర్మ, ఎంపీవో నర్సింహారావు, ఏపీవో రాంచందర్‌ తదితరులున్నారు.

పెద్దఅడిశర్లపలి: పీఏపల్లి మండలం భీమనపల్లి, వద్దిపట్ల, అజ్మాపురంలలో ఉపాధి నిధులతో చేపట్టిన పనులను జాతీయ స్థాయి బృందం గురువారం పరిశీలించింది. బృందం పరిశీలకుడు గంగప్ప ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్టుషెడ్లు, రైతువేదికలు, దొండ పందిర్లు, బత్తాయి తోటలను పరిశీలించి నిధుల వినియోగం గురించి ఆరా తీశారు. అనంతరం దస్త్రాలు పరిశీలించి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ శైలజ, అసిస్టెంట్‌ పీడీ రవీందర్‌, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఏపీవో శ్రీనివాస్‌, ఈసీ రాజు, సర్పంచులు, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని