Published : 21 Jan 2022 23:05 IST
Ts News: మార్చి 21 నుంచి యాదాద్రిలో మహాసుదర్శనయాగం
యాదాద్రి: యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు దాదాపు 95శాతం పూర్తయ్యాయని దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మహా సుదర్శనయాగం తర్వాత మార్చి 28 నుంచి యాదాద్రీశుడి స్వయంభూ దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు. ధ్వజస్తంభం బంగారు తాపడం, క్యూ కాంప్లెక్స్, కల్యాణ కట్ట పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు. మార్చి 21 నుంచి 28 వరకు రోజుకు లక్ష మంది భక్తులకు అన్న ప్రసాదం అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 75 ఎకరాల్లో 6వేల మంది రుత్వికులతో పూజలు చేయనున్నట్టు పేర్కొన్నారు. స్వామి దర్శనానంతరం ప్రధానాలయం అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం కొండపైన హరిత కాటేజీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇవీ చదవండి
Tags :