logo

యాదాద్రీశుడి సేవలో దేవాదాయశాఖ మంత్రి

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. కొండపైన గల బాలాలయంలోని పంచనారసింహుల ప్రతిష్ఠామూర్తులను దర్శించుకొని సువర్ణ పుష్పారాధనలో పాల్గొన్నారు.

Published : 22 Jan 2022 04:01 IST


పూజావిధానాల పుస్తకాన్ని ప్రధాన పూజారి నల్లందిగల్‌ లక్ష్మీనరసింహాచార్యతో కలిసి ఆవిష్కరిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,
చిత్రంతో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ఈవో గీత, తదితరులు

యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. కొండపైన గల బాలాలయంలోని పంచనారసింహుల ప్రతిష్ఠామూర్తులను దర్శించుకొని సువర్ణ పుష్పారాధనలో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ ప్రధాన పూజారులు, వేదపండితులు ఆశీస్సులు అందజేశారు. తొలుత మంత్రికి పూజారులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, దేవాదాయశాఖ రాష్ట్ర కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, యాడా వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు, ఈఎన్‌సీ రవీందర్‌రావు, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి ఉన్నారు. క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఆలయోద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేశ్‌బాబు, ప్రతినిధి జె.కృష్ణ శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం మంత్రి పునర్‌నిర్మితమైన ప్రధానాలయంతోపాటు మహారాజగోపురానికి స్వర్ణ కలశాల స్థాపనకు నిర్మించిన పరంజా ఎక్కి పరిశీలించారు.

యాదగిరిగుట్ట: యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో కొనసాగే నిత్య, వార, మాస, వార్షికోత్సవాలకు సంబంధించిన పూజా వివరాలతో కూడిన ప్రత్యేక పుస్తకాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ క్షేత్రంలో కొనసాగుతున్న వివిధ కైంకర్యాల వివరాలను ఆలయ ప్రధాన పూజారి నల్లందిగల్‌ లక్ష్మీనరసింహాచార్య పుస్తక రూపంలో పొందుపరిచారు. ఆ ఆధ్యాత్మిక పూజా పుస్తకాలను బాలాలయ ముఖమండపంలో మంత్రి ఆవిష్కరించారు. ప్రధాన పూజారిని శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఆలయ ఈవో గీతారెడ్డి, పేష్కార్‌ రమేశ్‌బాబు, ఏఈవోలు కృష్ణ, శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని