logo

జ్వర బాధితుల సర్వే ప్రారంభం

జిల్లాలో జ్వర బాధితుల వివరాలు సేకరించేందుకు శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖతోపాటు సమన్వయ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మొదటి రోజు జిల్లాలో 1,366 బృందాలు 58,440 ఇళ్లను సర్వే చేశారు.

Published : 22 Jan 2022 05:53 IST


నల్గొండలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో జ్వర బాధితుల వివరాలు సేకరించేందుకు శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖతోపాటు సమన్వయ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మొదటి రోజు జిల్లాలో 1,366 బృందాలు 58,440 ఇళ్లను సర్వే చేశారు. దీని ద్వారా 2.18 లక్షల మందిని సంప్రదించిన సిబ్బంది 2,041 మందికి జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, ఇతర సమస్యలు ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వం నుంచి వచ్చిన కిట్లను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇంటింటా జ్వర సర్వేలో వైద్యఆరోగ్యశాఖ అధికారి అన్నిమల్ల కొండల్‌రావు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి జ్వర సర్వే నిర్వహించన్నుట్లు తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శుక్రవారం జిల్లాలో 4,662 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 426 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషన్‌ డీఎంహెచ్‌వో వేణుగోపాల్‌రెడ్డి, డా. హరికృష్ణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని