logo

బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు కలెక్టర్‌ ఎంపిక

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ 2021 బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు కలెక్టర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది.

Published : 22 Jan 2022 05:53 IST


ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ 2021 బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు కలెక్టర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసిన అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించి గౌరవించే అవార్డుకు కలెక్టర్‌ను ఎంపికచేసింది. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎలక్ట్రోరల్‌ ప్రాక్టీస్‌ విభాగం కింద రాష్ట్ర అవార్డుకు ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ ఆర్డీవో బి.రోహిత్‌, నల్గొండ నాయబ్‌ తహసీల్దార్‌ ఎం.విజయ్‌కుమార్‌కు ప్రత్యేక కేటగిరి అవార్డులను ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని