logo

అభివృద్ధికి ఆదర్శం నల్గొండ

అభివృద్ధికి ఆదర్శం నల్గొండ అని మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. రైల్వేస్టేషన్‌, ఇండోర్‌స్టేడియం, గొల్లగూడ,.....

Published : 22 Jan 2022 05:53 IST


పరిశీలిస్తున్న కమిషనర్‌ రమణాచారి

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: అభివృద్ధికి ఆదర్శం నల్గొండ అని మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. రైల్వేస్టేషన్‌, ఇండోర్‌స్టేడియం, గొల్లగూడ, పద్మావతికాలనీ కాలనీల్లో పారిశుద్ధ్య సేవలను పరిశీలించి మాట్లాడారు. రైల్వేస్టేషన్‌ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని, అందుకు కృషి చేస్తున్న స్టేషన్‌ మాస్టర్‌ను సన్మానించాలని అధికారులను ఆదేశించారు. ఇండోర్‌స్టేడియంలో మౌలిక సౌకర్యాల కల్పనకు అమృత్‌ నిధులు మంజూరైతే సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఈ అశోక్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శశిథర్‌రెడ్డి, పర్యావరణ ఇంజినీర్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని