logo

‘తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలి’

విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది లైన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు....

Updated : 22 Jan 2022 15:57 IST

చౌటుప్పల్‌: విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది లైన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ ప్లాజా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం మృతులకు లక్కారంలో ఎంపీ శనివారం నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఏడేళ్ల కాలంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం చేపట్టాలని ప్రధాని మోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. తాను ఈ సారి పార్లమెంట్‌లో ఈ అంశంపై ప్రశ్నిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.వెయ్యి కంటే మించిన రోగాలకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సహాయం అందిస్తు్న్నారని.. ఆ పథకం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన, మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట స్థానిక కౌన్సిలర్లు సైదులు గౌడ్‌, మంజుల, వైస్‌ ఎంపీపీ భద్రయ్య తదితరులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని