logo

నారసింహుడి బ్రహ్మోత్సవాలకు.. 40 రోజులే!

ఈసారీ బాలాలయంలోనే నిర్వహణయాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే మార్చి 4 నుంచి 14 వరకు జరగనున్నాయి. పదకొండు రోజుల పాటు కొనసాగే వేడుకలకు గడువు ఆదివారం నాటికి 40 రోజులే మిగిలాయి.

Published : 23 Jan 2022 05:08 IST

పునర్నిర్మితమైన ప్రధాన ఆలయం సన్నిధి

సారీ బాలాలయంలోనే నిర్వహణయాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే మార్చి 4 నుంచి 14 వరకు జరగనున్నాయి. పదకొండు రోజుల పాటు కొనసాగే వేడుకలకు గడువు ఆదివారం నాటికి 40 రోజులే మిగిలాయి. పునర్నిర్మితమైన పంచ నారసింహుల ఆలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా నిలిచిపోయిన గర్భాలయంలోని మూలవర్యుల నిజ దర్శనాలకు తెర తీసేందుకు మార్చి 28న ‘మహాకుంభ సంప్రోక్షణ’ నిర్వహిస్తారు. అంతకు ముందుగా శ్రీ సుదర్శన మహాయాగం జరుపుతారు. ఈ మహాక్రతువులకు రెండు వారాల ముందే వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. యాదగిరిగుట్టను యాదాద్రి పేరిట మహాదివ్య పుణ్యక్షేత్రంగా నలుదిశలా ఖ్యాతిచెందేలా అభివృద్ధి పరిచే దిశలో భక్తుల దైవారాధనలకు ప్రత్యామ్నాయంగా నిర్మించిన బాలాలయంలోనే వార్షిక ఉత్సవాలను 2017 నుంచి కొనసాగిస్తున్నారు. ఈ సారి నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఆరోసారి కానున్నాయి.

త్వరలో కలశ స్థాపన

ప్రధాన ఆలయ ఉద్ఘాటనలో భాగంగా గోపురాలపై స్వర్ణ కలశాల ప్రతిష్ఠాపన చేపట్టనున్నారు. ఇందుకు తేదీ ఖరారు కాలేదు. ఆ విశిష్ట పర్వంతో బ్రహ్మోత్సవాల్లో మార్పులేమైనా జరుగుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు చినజీయర్‌ స్వామిని సంప్రదించాలని ఆలయ నిర్వాహకులు యోచిస్తున్నారు.

బాలాలయం

వేడుకలు ఇలా..

ఏటా ఫాల్గుణ మాసం లో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ సారి మార్చి 4(విదియ)న మొదలవుతాయని దేవస్థానం వారి 2022 సంవత్సర కాలమానినిలో ప్రచురించారు. శ్రీ స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణమహోత్సవం అదే నెల 11(నవమి)న నిర్వహిస్తారు. 14న ఏకాదశి రోజు ఉత్సవాలు ముగుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని