logo

దళితబంధు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయండి

రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయనున్న నేపథ్యంలో లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. దళితబంధు పథకం అమలుపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌,

Published : 23 Jan 2022 05:41 IST

దూరదృశ్య మాధ్యమ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి

భువనగిరి, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయనున్న నేపథ్యంలో లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. దళితబంధు పథకం అమలుపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం ఆయన దూరదృశ్య శ్రవణ మాధ్యమ సమావేశం ద్వారా సమీక్షించారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లు సమావేశమై ఫిబ్రవరి 5లోగా అర్హులైన జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. మార్చి 7లోగా ఎంపిక చేసిన వారికి యూనిట్ల గ్రౌండింగ్‌ చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. దళితబంధు పథకం అమలుకు రూ.100 కోట్లు విడుదలయ్యాయని, రెండు, మూడు రోజుల్లో రూ.1200 కోట్లు విడుదల చేసి కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. సమీక్షలో కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని