logo

గొంతు నులిమి.. భార్యను హతమార్చి..

కుటుంబ కలహాలతో భార్యను గొంతు నులిమి భర్త హత్యచేసిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఒకటో పట్టణ సీఐ మండవ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 23 Jan 2022 05:53 IST

మిర్యాలగూడ: కుటుంబ కలహాలతో భార్యను గొంతు నులిమి భర్త హత్యచేసిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఒకటో పట్టణ సీఐ మండవ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మేదరి బజార్‌కు చెందిన గూడపూరి దీపక్‌కు స్రవంతి(27)కి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఉన్నారు. ఇద్దరి మధ్య విభేదాలతో కొంతకాలంగా వేర్వేరుగా ఉంటుండగా కేసు కోర్టులో నడుస్తుంది. శనివారం రాత్రి గూడపూరి స్రవంతిని ఆమె భర్త దీపక్‌ విభేదాలతో గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒకటో పట్టణ పోలీసులు స్రవంతి మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

మర్రిగూడ, న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం భవన నిర్మాణ పనులకు వచ్చి రోడ్డు ప్రమాదానికి గురై యువకుడు మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జైహారం గ్రామానికి చెందిన పెద్దకత్తుల విజయ్‌ (22) నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మండలంలోని భీమనపల్లి గ్రామంలో అదే ప్రాంతానికి చెందిన సురేశ్‌ మేస్త్రీ వద్ద పని చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా తమతో పని చేస్తున్న వెంకటయ్య తన స్వగ్రామానికి వెళ్తుండటంతో ఈ నెల 12న బస్‌ ఎక్కించేందుకు విజయ్‌ మాల్‌కు వెళ్లారు. కాగా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మేస్త్రీ సురేశ్‌పై టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులకు శనివారం కుళ్లిన వాసన వస్తుండటంతో దగ్గరికి వెళ్లి పరిశీలించగా వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి అక్కడే పంచనామా నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో తిరుగండ్లపల్లి వద్ద ప్రమాదానికి గురై వాహనంతో సహా రోడ్డుపక్కనే గుబురుగా ఉన్న పొదల్లో పడి మృతి చెందాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వీరన్న తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు