logo

మన థియేటర్లలో భద్రతెంత?

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని అంజిరెడ్డి సినిమా థియేటర్‌లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. వరండాలో మంటలు చెలరేగడంతో లోపల దట్టమైన పొగ అలుముకుంది. గమనించిన ప్రేక్షకులు తలుపులు తెరుచుకుని బయటకు పరుగులు తీశారు.

Published : 25 Jan 2022 04:59 IST


చౌటుప్పల్‌లో అగ్నిప్రమాదం జరిగిన థియేటర్‌ ఇదే...

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని అంజిరెడ్డి సినిమా థియేటర్‌లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. వరండాలో మంటలు చెలరేగడంతో లోపల దట్టమైన పొగ అలుముకుంది. గమనించిన ప్రేక్షకులు తలుపులు తెరుచుకుని బయటకు పరుగులు తీశారు.
కుటుంబంతో కలిసి సంతోషంగా సినిమా చూడాలని ఆశించిన ప్రేక్షకులకు థియేటర్లు ఆధునిక హంగులతో ఉన్నా భద్రతా ప్రమాణాలు ఇబ్బందిగా ఉన్నాయని వీక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ భవన నిర్మాణ సంస్థ సూచించే ప్రమాణాలు సినిమా థియేటర్లు పాటించడం లేదని చెబుతున్నారు. సినిమా థియేటర్లలో టికెట్‌ ధరలు అధికం ఉన్నా, పార్కింగ్‌ రుసుం వసూలు చేస్తున్నా భద్రతా పరంగా ఇబ్బందులు ఉన్నాయని వీక్షకులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు చేపడుతున్నామని  అధికారుల నుంచి అనుమతి తీసుకున్నా నిబంధనలు పాటించడం లేదనే ప్రచారముంది. ప్రతి మూడేళ్లకోసారి అగ్నిమాపక శాఖ అనుమతి రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉన్నా వస్తున్న వారు తగ్గిపోతున్నారు. కరోనాతో ఉమ్మడి జిల్లాలో పదికిపైగా థియేటర్లు మూతపడ్డాయి. మరికొన్ని మూసివేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఉమ్మడి నల్గొండలో జిల్లాలో 45 థియేటర్లు ఉండగా మూసివేస్తున్న వారి సంఖ్య పెరగడంతో ప్రస్తుతం 28 మిగిలాయి. నల్గొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 10, భువనగిరి జిల్లాలో 6 నడుస్తున్నాయి. ఈ సారి కరోనాతో మూసివేయాల్సి వస్తే ఇక టాకీసులే మిగలవని నిర్వాహకులు అంటున్నారు. ఇప్పటికే పంపిణీదారులు సినిమాకో రేటు ఇస్తూ నడిపిస్తున్నారని సమాచారం. టాకీసుల నిర్వహణకు అన్ని అనుమతులు ఉన్నా పైర్‌ అనుమతితో పాటు పర్యవేక్షణ తప్పనిసరి.


మంటలు తట్టుకునేలా పరికరాలు వాడాలి  
- యజ్ఞ నారాయణ, జిల్లా పైర్‌ అధికారి, నల్గొండ  

జాతీయ భవన నిర్మాణ సంస్థ సూచించిన విధంగా అగ్నిమాపక నిబంధనలు పాటించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మంటలు తట్టుకునే సామగ్రి వాడితే సమస్య ఉండదు. ప్రతి మూడేళ్లకోసారి పునరుద్ధరణ చేసుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న అన్ని రెన్యూవల్స్‌ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు ఉన్నా సిబ్బందికి పరికరాలు ఉపయోగించడం తెలియక పోతే సమస్య వస్తుంది.


నిబంధనలివీ...
థియేటర్లలో అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం అన్ని కనిపిస్తాయి.. కానీ అవి పనిచేయవనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వాటిని ఉపయోగించే నైపుణ్యం ఉండదు. చుట్టూ పైర్‌ ఇంజిన్‌ తిరిగేలా సెట్‌బ్యాక్‌ ఉండాలి. ప్రతి కేటగిరికి రెండు వైపులా డోర్స్‌కు రేడియం స్టిక్కర్‌తో అత్యవసర ద్వారం గుర్తించేలా రాసి ఉంచాలి. మంటలు చల్లార్చడానికి గ్యాస్‌ సిలిండర్లు కనిపించేలా ఉంచాలి. తెర ముందు కనిపించేలా ఇసుక నింపిన బకెట్లు ఉంచాలి. నీటిని మంటలపై చల్లడానికి పైపులైన్‌ ఉండాలి. మంటలు ఆర్పడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసే ఏజెన్సీల నుంచి సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని