logo

గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన

మండలంలోని పెండ్లిపాకల జలాశయం పెంపు వల్ల ముంపునకు గురవుతున్న కుటుంబాలకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని పెంచాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌ - సాగర్‌ ప్రధాన రహదారిలో చిన్నఅడిశర్లపల్లి గేటు సమీపంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

Published : 25 Jan 2022 04:59 IST

నిరసనలో పాల్గొన్న గిరిజన సంఘాల నాయకులు

కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని పెండ్లిపాకల జలాశయం పెంపు వల్ల ముంపునకు గురవుతున్న కుటుంబాలకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని పెంచాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌ - సాగర్‌ ప్రధాన రహదారిలో చిన్నఅడిశర్లపల్లి గేటు సమీపంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఇస్లావత్‌ కిషన్‌నాయక్‌ మాట్లాడుతూ భూములను కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రెండు పడక గదుల ఇళ్లుతో పాటు జలాశయానికి దేవులసాథ్‌ సాగర్‌గా నామకరణం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసుల జోక్యంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో సేవాలాల్‌ బంజరా సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర చందునాయక్‌, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమావత్‌ రమేష్‌నాయక్‌, కొర్ర నాగరాజునాయక్‌, జైస్వరాజ్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నేనావత్‌ నగేష్‌నాయక్‌, వెంకటేష్‌, బాలు, రమేష్‌, శంకర్‌, ప్రవీణ్‌, సుభాష్‌ కోటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని