logo

సర్వాయి పాపన్న స్ఫూర్తితో కేసీఆర్‌ పాలన: మంత్రి

నాటి సమాజంలో వృత్తులు మాత్రమే ఉండేవని, కులాలన్నింటిని మానవులు సృష్టించుకున్నవేనని.. మారిన పరిస్థితుల నేపథ్యంలో మానవత్వమే మన కులం కావాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతికÛ, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం ఆలేరు మండలం శారాజీపేటలో గౌడ ఐక్యవేదిక ఆధ్వర్యంలో

Published : 25 Jan 2022 04:59 IST


శారాజీపేటలో సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత

ఆలేరు, న్యూస్‌టుడే: నాటి సమాజంలో వృత్తులు మాత్రమే ఉండేవని, కులాలన్నింటిని మానవులు సృష్టించుకున్నవేనని.. మారిన పరిస్థితుల నేపథ్యంలో మానవత్వమే మన కులం కావాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతికÛ, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం ఆలేరు మండలం శారాజీపేటలో గౌడ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మొగులుల పరిపాలనలో పీడనకు, దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాలను చైతన్య పరచి ఎదురించిన సర్వాయి పాపన్న సృహ కలిగిన నాయకుడని కొనియాడారు. బహుజన వీరుడైన పాపన్న గురించి కొందరికి మాత్రమే తెలియడం బాధాకరమన్నారు. సర్వాయి పాపాన్న స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. భువనగిరి, యాదాద్రి, కొలనుపాక ప్రాంతాలను ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, తెలంగాణతో పోల్చి చూసుకోవాలన్నారు. యాదాద్రి జిల్లాలోని నందనంలో రూ.8కోట్లతో నీరా కేంద్రం ఏర్పాటు కానుందని, హైదరాబాద్‌ ట్యాంకుబండ్‌ సమీపంలో రూ.14కోట్లతో నీరా కేంద్ర పనులు జరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో యాదాద్రి జిల్లాలో మరో నీరా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ పాపన్నగౌడ్‌ పోరాటతీరు నేటి తరానికి స్పూర్తి కావాలన్నారు. ఆలేరు ప్రాంతాన్ని పర్యాటక స్పాట్‌గా గుర్తించి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. రాజపేట, కొలనుపాక, జీడికల్‌ ప్రాంతాలను పర్యాటక శాఖలోకి తీసుకోవాలని, కొలనుపాకను దత్తత తీసుకోవాలని మంత్రిని కోరారు. అంతకుమందు ఆలేరులో గీత కార్మికులు మంత్రికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, గౌడ ఐక్య సాధన సమితి వ్వవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్‌, కార్య నిర్వాహక అధ్యక్షుడు బబ్బూరి భిక్షపతిగౌడ్‌ సర్పంచి బండ పద్మ, ఎంపీటీసీ సభ్యుడు బత్తుల నరేందర్‌రెడ్డి, గౌడ ఐక్య సాదన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మొరిగాడి అశోక్‌, బెంజారం రవి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని