logo

అభివృద్ధి పనులపై సమీక్ష

పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం సమీక్షించారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న తీరుపై చర్చించారు. జూనియర్‌ కళాశాల ఆవరణలో

Published : 25 Jan 2022 05:25 IST

భువనగిరి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి

భువనగిరి: పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం సమీక్షించారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న తీరుపై చర్చించారు. జూనియర్‌ కళాశాల ఆవరణలో ఓపెన్‌ స్టేడియం, పెద్దచెరువు సుందరీకరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌పై సమీక్షించారు.  పుర అధ్యక్షుడు ఎ.ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ కిష్టయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌, తదితరులు పాల్గొన్నారు.
కొసమెరుపు.. కలెక్టర్‌ సమీక్ష సమావేశాలకు అధికారులు, ప్రజాప్రతినిధులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇతరులను ఎవరినీ కూడా అనుమతించడంలేదు. అలాంటిది సోమవారం అభివృద్ధి పనులపై సమీక్షించిన అధికారిక సమీక్షలో ఆరోవార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ తోటకూరి అనురాధ భర్త పాండు హాజరుకావడం గమనార్హం.

ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించాలి..భువనగిరి: ఈనెల 26న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఉ.10 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని సూచించారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని వెల్లడించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని