logo

‘తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామినవుతా’

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్య అయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌ అన్నారు. భువనగిరి పురపాలిక పరిధిలోని రాయగరిలో సోమవారం గొల్లకుర్మ సంఘం ఆధ్వర్యంలో బాలరాజ్‌యాదవ్‌కు ఆత్మీయ సన్మానోత్సవాన్ని నిర్వహించారు.

Published : 25 Jan 2022 05:25 IST

 


దూదిమెట్ల బాలరాజుయాదవ్‌ సన్మానోత్సవంలో పాల్గొన్న ఎంపీ లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, అయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ రామకృష్ణారెడ్డి, తదితరులు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్య అయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌ అన్నారు. భువనగిరి పురపాలిక పరిధిలోని రాయగరిలో సోమవారం గొల్లకుర్మ సంఘం ఆధ్వర్యంలో బాలరాజ్‌యాదవ్‌కు ఆత్మీయ సన్మానోత్సవాన్ని నిర్వహించారు. సన్మానోత్సవ కార్యక్రమానికి ముందు ఆయన భువనగిరి శివారులోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. అక్కడ నుంచి ర్యాలీగా గార్డెన్‌కు చేరుకున్నారు. పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులగా హాజరైన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ప్రభుత్వ విఫ్‌ సునీత, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అయిల్‌ఫెడ్‌ రాష్ట్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా బాలరాజ్‌యాదవ్‌ మాట్లాడుతూ  సీఎం కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్ర లేదని, అలాంటి వ్యక్తిని విమర్శిస్తున్న బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ యాదవ్‌ తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా ఎన్నో అవకాశాలను సీఎం కేసీఆర్‌ ఇచ్చారన్నారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులందరికి ఎప్పుడోకప్పడు అవకాశాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, గొల్లకుర్మల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు క్యాస మల్లేషం, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్‌ కొల్లుల అమరేందర్‌, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అమదరేందర్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తెరాస నాయకులు, గొల్లకుర్మసంఘ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని