logo

టీకా వేసుకోనంటే.. వేసుకోను

కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నం చేస్తుంది. వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, అధికారులు ఇంటింటికి వెళ్లి టీకా ఇస్తున్న సంగతి విదితమే. తుంగతుర్తి మండలం సంగెంలో దుబ్బాక యాదగిరి మినహా మిగిలిన వారందరికీ మొదటి విడత టీకా పంపిణీ చేశారు.

Published : 25 Jan 2022 05:25 IST

సంగెంలో దుబ్బాక యాదగిరిని నలుగురు పట్టుకోగా టీకా ఇస్తున్న ఏఎన్‌ఎం దేవేంద్ర

తుంగతుర్తి, న్యూస్‌టుడే: కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నం చేస్తుంది. వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, అధికారులు ఇంటింటికి వెళ్లి టీకా ఇస్తున్న సంగతి విదితమే. తుంగతుర్తి మండలం సంగెంలో దుబ్బాక యాదగిరి మినహా మిగిలిన వారందరికీ మొదటి విడత టీకా పంపిణీ చేశారు. అతడికి టీకా ఇచ్చేందుకు వైద్య సిబ్బంది, అధికారులు ఎన్నిసార్లు వెళ్లినా తప్పించుకు తిరుగుతున్నారు. ఒకవేళ దొరికినా టీకా వేయించుకోడానికి మొరాయిస్తున్నారు. చేసేదేమీ లేక వైద్య సిబ్బంది ఈ విషయాన్ని ఎంపీడీవో ఉపేందర్‌రెడ్డికి చేరవేశారు. వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలతో పాటు సర్పంచి ఏశమల్ల సుశీల, పంచాయతీ సిబ్బంది కలిసి యాదగిరి ఇంటికి ఎంపీడీవో సోమవారం వెళ్లారు. టీకా తీసుకోవాలని చెప్పినా వినలేదు. ఏవీ ఫలితం ఇవ్వలేదు. యాదగిరిని పట్టుకోమని పంచాయతీ సిబ్బంది చెప్పి ఏఎన్‌ఎం దేవేంద్రతో టీకా ఇప్పించారు.

28న ఉద్యోగ మేళా
సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: సూర్యాపేటలో వాణిజ్య భవన్‌ సెంటర్‌లోని రైస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళాను శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్‌.మాధవరెడ్డి సోమవారం తెలిపారు. మూడు ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో జరిగే ఉద్యోగ మేళాకు పదోతరగతి నుంచి ఆపై, ఐటీఐ చదివిన 18 నుంచి 30 ఏళ్ల వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు ఒరిజినల్‌, నకలు ధ్రువపత్రాలతోపాటు నకలు ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో తీసుకురావాలన్నారు. అదనపు సమాచారం కోసం 94419 93390, 96768 6466 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని