logo

నర్సింహకు ‘ఆర్పీఎఫ్‌ ఉత్తమ సేవా పతకం’

చౌటుప్పల్‌కు చెందిన ఉడుగు నర్సింహ గౌడ్‌ ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. ఆయన దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ ఉడుగు నర్సింహ గౌడ్‌ విధులు నిర్వహిస్తున్నారు.

Published : 26 Jan 2022 04:17 IST

ఉడుగు నర్సింహ

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: చౌటుప్పల్‌కు చెందిన ఉడుగు నర్సింహ గౌడ్‌ ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. ఆయన దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ ఉడుగు నర్సింహ గౌడ్‌ విధులు నిర్వహిస్తున్నారు. 26 ఏళ్లుగా విధి నిర్వహణలో అంకితభావంతో అత్యుత్తమ సేవలు అందించినందుకు భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ పురస్కారాన్ని మంగళవారం ప్రకటించింది. నర్సింహ 1997లో దక్షిణ మధ్య రైల్వేలో కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో ఎస్సైగా ఉద్యోగంలో చేరారు. 2003 నుంచి 2010 వరకు సికింద్రాబాద్‌ డివిజన్‌లో విధులు నిర్వహించి ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగొన్నతి పొందారు. కాజీపేట, వరంగల్‌లో, క్రైం బ్రాంచిలో బాధ్యతలు నిర్వర్తించారు. దోపిడీ ముఠాలను పట్టుకుని వారి నుంచి రూ.1.35 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే రిజర్వేషన్‌ టికెట్ల మోసాలకు పాల్పడే 45 మందిని పట్టుకున్నారు. నార్కోటిక్‌ మత్తు పదార్థాల రవాణ చేసే ముఠాను పట్టుకున్నారు. ఇతని సేవలకు 2003లో రైల్వే శాఖ మంత్రి నుంచి, 2013లో రైల్వే డైరక్టర్‌ జనరల్‌ నుంచి, 2021లో జనరల్‌ మేనేజర్‌ నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. తనకు ఉత్తమ సేవా పతకం ప్రకటించినందుకు నర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. తాను మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని